లాభాలతో ప్రారంభం కానున్న నిఫ్టి
అంతర్జాతీయ మార్కెట్లు స్థిరంగా ఉన్నాయి. నిన్న యూరో మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. ప్రధాన మార్కెట్లు స్వల్ప నష్టాలతో ముగిశాయి. రాత్రి అమెరికా మార్కెట్లు స్వల్ప లాభాలతో ముగిశాయి. సూచీల స్థాయిని చూస్తే లాభాలు నామమాత్రమే. ఇక ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి. నిన్నటి మాదిరి ఇవాళ కూడా జపాన్ నిక్కీ గ్రీన్లో ఉంది. మొత్తం చైనా, హాంగ్కాంగ్ మార్కెట్లు ఇవాళ కూడా నష్టాల్లో ఉన్నాయి. మిగిలిన మార్కెట్లు స్వల్ప లాభాల్లో ఉన్నాయి. డాలర్ మళ్ళీ బలహీనపడుతోంది. దాదాపు 93ను దాటే ప్రయత్నం చేసిన డాలర్ ఇండెక్స్ ఇపుడు 92.50 ప్రాంతంలో ట్రేడవుతోంది. క్రూడ్ మళ్ళీ 74 డాలర్లను దాటింది.