For Money

Business News

స్థిరంగా ముగిసిన నిఫ్టి

ఉదయం ఆసియా మార్కెట్ల పతనాన్ని మన మార్కెట్లు పూర్తిగా పట్టించుకోలేదు. టెక్‌ కంపెనీలపై చైనా ఉడుం పట్టు బిగించడంతో ఆ దేశ మార్కెట్లతో పాటు హాంగ్‌కాంగ్ మార్కెట్లు ఇవాళ భారీ నష్టాలతో ముగిశాయి. దీంతో సింగపూర్‌ నిఫ్టి వంద పాయింట్ల నష్టంతో ఉన్నా… మన నిఫ్టి స్థిరంగా ప్రారంభమై… ఒకదశలో 15900 దాకా వెళ్ళింది. అయితే మిడ్‌ సెషన్‌లో మొదలైన యూరో మార్కెట్లు పరిమిత నష్టాలతో ట్రేడ్‌ కావడంతో… మన మార్కెట్లు కూడా స్వల్ప నష్టాలతో ముగిశాయి. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 32 పాయింట్ల నష్టంతో 15,824 పాయింట్ల వద్ద ముగిసింది. బ్యాంక్‌ షేర్లో పాటు మిడ్‌ క్యాప్‌ సూచీ స్వల్ప నష్టంతో ముగిసింది. రిలయన్స్‌ కౌంటర్‌లో ఇన్వెస్టర్లు లాభాలు స్వీకరించడంతో ఆ షేర్‌ 1.5 శాతంపైగానే నష్టపోయింది.

నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
ఎస్‌బీఐ లైఫ్‌ 1,092.05 3.96
బజాజ్‌ ఫిన్‌ సర్వ్‌ 13,515.85 2.38
హిందాల్కో 399.10 1.88 దివీస్‌ ల్యాబ్‌ 4,914.90 1.87
అల్ట్రాటెక్‌ సిమెంట్‌ 7,620.00 1.73

నిఫ్టి టాప్‌ లూజర్స్‌
జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ 704.60 -1.80
విప్రో 589.95 -1.54
రిలయన్స్‌ 2,073.90 -1.51
ఎస్‌బీఐ 422.85 -1.41
బీపీసీఎల్‌ 455.45 -1.28