బిట్‌కాయిన్ 10000 డాలర్లకు పడుతుంది
క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్ పది వేల డాలర్లకు పడుతుందని మొబియస్ క్యాపిటల్ పార్టనర్స్ సహ వ్యవస్థాపకుడు మార్క్ మోబియస్ తెలిపారు. ఆయన సింగపూర్‌లో మీడియాతో మాట్లాడుతూ… తన సొమ్మును కాని, తన క్లయింట్ల సొమ్మును కాని క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్ చేయనని అన్నారు. అది చాలా ప్రమాదకరమైన వ్యాపారమని ఆయన చెప్పారు. క్రిప్టో మరింత పడే అవకాశముందని అన్నారు. ప్రస్తుతం బిట్‌కాయిన్ 16270 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.అయితే క్రిప్టో కరెన్సీ కనుమరుగు కాదని, ఇందులో ఆసక్తి ఉన్నవారు ఇంకా ఉన్నారని… కాబట్టి క్రిప్టో మున్ముందు కూడా ఉంటుందని అన్నారు. బిట్ కాయిన్ ధరలు ఇంకా అంత ఎక్కువ ఎలా ఉన్నాయోనని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎఫ్‌టీఎక్స్ ఎక్స్ఛేంజీ దివాలా తరవాత ఇన్వెస్టర్లు క్రిప్టో కరెన్సీ అంటే జంకుతున్నారు. అయినా బిట్ కాయిన్ ఇంకా స్థిరంగా కనసాగడం విశేషం.