For Money

Business News

కోల్‌ ఇండియా మళ్ళీ వాటా అమ్మకం

ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాను అమ్మి భారీగా నిధులు సమకూర్చుకున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇప్పటికే లిస్టయిన కొన్ని కంపెనీల్లో మరింతగా తన వాటా అమ్మకాలని నిర్ణయించింది. ఈ ఏడాది చివరి త్రైమాసికంలో ఈ కంపెనీల్లో వాటాను అమ్మాలని ప్రతిపాదించినట్లు బ్లూమ్‌బర్గ్‌ వార్తా సంస్థ పేర్కొంది. కోల్‌ ఇండియా, హిందుస్థాన్‌ జింక్‌, రాష్ట్రీక కెమికల్స్‌ అండ్‌ ఫర్టిలైజర్స్ కంపెనీల్లో కనీసం 5 నుంచి 10 శాతం వాటా అమ్మకాల కేంద్ర నిర్ణయించినట్లు బ్లూమ్‌బర్గ్‌ పేర్కొంది. ఈ వాటాల అమ్మకం ద్వారా కనీసం రూ. 16500 కోట్లు వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. హిందుస్థాన్‌ జింక్‌లో తనకు ఉన్న వాటాను అమ్మకాలని కేంద్రం ఇది వరకే నిర్ణయించింది. అయితే మార్కెట్‌ మూడ్‌ను బట్టి నేషనల్‌ ఫర్టిలైజర్స్‌, ఆర్‌సీఎఫ్‌లో పది నుంచి 20 శాతం వాటా అమ్మాలని కేంద్రం భావిస్తోందని మనీ కంట్రోల్‌ డాట్‌ కామ్‌ రాసింది.