పేటీఎం కొనండి… సిటీ బ్యాంక్ సిఫారసు
పేటీఎం షేర్ వరుసగా క్షీణిస్తూ వస్తోంది. దాదాపు రూ. 2000వద్ద ఉన్న షేర్ ఇపుడు రూ. 400 దరిదాపుల్లోకి వచ్చింది. ఇది కొనుగోలు చేసేందుకు మంచి సమయమని సిటీ బ్యాంక్ అంటోంది. కంపెనీ పనితీరు పరిశీలించిన సిటీ బ్యాంక్ ఈ కంపెనీ షేర్‌కు కొనుగోలు రెకమెండేషన్ ఇచ్చింది. పేయూతో పోలిస్తే డిజిటల్ పేమెంట్ విభాగంలో తన వాటాను పేటీఎం పెంచుకుందని సిటీ బ్యాంక్ అంటోంది. యాక్టివ్ కస్టమర్ బేర్‌లో మరింత వేగం కోసం పేటీఎం ప్రయత్నిస్తోందని తెలిపింది. 2024 ఆర్థిక సంవత్సరం అర్నింగ్స్కు (ఈవీ/కంట్రిబ్యూషన్ ప్రాఫిట్స్) ఈ షేర్ ఇపుడు 5 రెట్ల వద్ద ట్రేడవుతోందని సిటీ బ్యాంక్ పేర్కొంది.పైగా పబ్లిక్ ఇష్యూకు ముందు ఈ కంపెనీలో పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్ల ఇక అమ్మే ఛాన్స్ తగ్గినట్లేనని పేర్కొంది. ఎందుకంటే ఇపుడు అమ్మితే ఆ కంపెనీలు కూడా నష్టపోతాయి గనుక. ప్రస్తుతం పేటీఎం షేర్ నిన్న రూ. 441.5 వద్ద ఎన్ఎస్ఈలో ముగిసింది. ఈ షేర్ టార్గెట్ ధర రూ.1055గా సిటీ బ్యాంక్ పేర్కొంది.