LEVELS: కొనండి కానీ…
ఈక్విటీ మార్కెట్లు కొత్త రికార్డుల వేటలో ఉన్నాయి. ఇదే సమయంలో ప్రతికూల అంశాలు లేవు. అలాగని మార్కెట్‌కు ముందుకు తీసుకెళ్ళే పాజిటివ్ న్యూస్ కూడా లేదు. సాధారణంగా డిసెంబర్ సిరీస్ డల్‌గా ఉంటుంది. క్రిస్మస్ సెలవుల హడావుడి తప్ప అంతర్జాతీయ మార్కెట్లలో పెద్ద ట్రేడింగ్ వ్యాల్యూమ్ ఉండదు. మన మార్కెట్లు కూడా అధిక స్థాయిలో నిలదొక్కుకునే ప్రయత్నం చేయొచ్చు. ఇలాంటి సమయంలో నిఫ్టిలో స్వల్ప కరెక్షన్ వచ్చే వరకు ఆగి కొనుగోలు చేయాలని టెక్నికల్ అనలిస్టులు అంటున్నారు. మార్కెట్ పొజిషనల్ ట్రేడర్లు, డే ట్రేడర్లు ఉంటారు. మార్కెట్లో పొజిషనల్ ట్రేడర్స్‌కు నవంబర్ సిరీస్ 18000 స్టాప్ లాస్‌తో ప్రారంభమైంది. ఆ తరవాత 18150, 18250తో ట్రేడ్ చేశారు. ఇపుడు కూడా పొజిషనల్ ట్రేడర్స్ 18250ని స్టాప్‌లాస్‌తో పెట్టుకుని…పడినపుడల్లా కొనొచ్చని సీఎన్‌బీసీ ఆవాజ్ ఛానల్ మేనేజింగ్ ఎడిటర్ అనూజ్ సింఘాల్ అంటున్నారు. ఇక డే ట్రేడర్ల విషయానికొస్తే 18360ని స్టాప్‌లాస్‌గా ఉంచుకోవాలని సూచించారు. నిఫ్టి పడినపుడు కొనాలని… మరి 18400 వద్ద కొంటారా? లేదా 18380 వద్ద కొంటారా అన్నది ఇన్వెస్టర్ల ఇష్టమని.. అయితే 18360ని స్టాప్‌లాస్‌తో పెట్టుకోవాలని సూచిస్తున్నారు. నిన్న ఐటీ షేర్లు బాగా రాణించాయి. నాస్డాక్ ప్రస్తుత స్థాయిలో నిలదొక్కుకుంటోందని.. ఈ సమయంలో మన మార్కెట్లోకూడా ఐటీ షేర్లకు బేస్ ఏర్పడుతోందని అనలిస్టులు అంటున్నారు. నిఫ్టిలో కూడా 42800 ప్రాంతంలో కొనుగోలు చేయొచ్చని… 150 లేదా 100 పాయింట్ల స్టాప్‌లాస్‌తో కొనుగోలు చేయొచ్చని అనూజ్ సింఘాల్ అన్నారు.