పేటీఎం ఇన్వెస్టర్లు లబోదివో
దీర్ఘకాలిక ఇన్వెస్టర్లకు పేటీఎం ఓ పీడకల అని అనుకోవచ్చు. పేటీఎం పబ్లిక్ ఆఫర్లో షేర్లను రూ. 2150లకు ఆఫర్ చేసింది. లిస్టయిన తరవాత ఈ షేర్ ఇప్పటి వరకు ఆ ధర రాలేదు. ఈ షేర్ 52 వారాల గరిష్ఠ ధర రూ.1955 కాగా, కనిష్ఠ ధర రూ. 510. అంటే పబ్లిక్ ఆఫర్ ధర ఎపుడూ రాలేదు. ఇటీవల రూ. 510కి పడినా.. తరవాత పెరుగుతూ వచ్చింది. అయితే ఈ కంపెనీలో ప్రధాన ఇన్వెస్టర్ అయిన సాఫ్ట్ బ్యాంక్ తన వాటాలో కొంత భాగాన్ని ఇవాళ బ్లాక్‌డీల్ కింద అమ్మనుంది. ఈ వార్త నిన్ననే మార్కెట్‌కు తెలియడంతో షేర్ నాలుగు శాతం క్షీణించి రూ. 601ని తాకింది. చిత్రంగా ఇవాళ దాదాపు రూ.1750 కోట్ల విలువైన పేటీఎం షేర్లను సాఫ్ట్ బ్యాంక్ ఇవాళ అమ్మనుంది. అమ్మకం ధర రూ. 555 ఉంటుందని భావిస్తున్నారు. అంటే భారీ నష్టంతో ప్రారంభం కానుందన్నమాట. ఇపుడు పేటీఎంలో సాఫ్ట్‌బ్యాంక్‌కు 17.45 శాతం వాటా ఉండగా, ఈ బ్లాక్‌డీల్ తరవాత వాటా
12.9 శాతానికి చేరనుంది. పేటీఎంలో వాటా కారణంగా సాఫ్ట్‌బ్యాంక్ భారీ నష్టాలను మూటగట్టుకుంది. దీనికి ప్రధాన కారణంగా డాలర్ బలపడటం. యాక్సిస్ బ్యాంక్‌లో కూడా ఇటీవల ఓ విదేశీ ఇన్వెస్టర్ నష్టంతో బయపడ్డారు. నిజానికి విదేశీ ఇన్వెస్టర్ పెట్టుబడి పెట్టినపుడు ఉన్న షేర్ ధర 60 శాతంపైగా పెరిగింది. అయితే డాలర్ లెక్కన చూస్తే ఇపుడున్న ధర వద్ద యాక్సిస్ షేర్లను అమ్మినా.. తాను అమ్మినపుడు ఎన్ని డాలర్లు పెట్టారో… అవి రాలేదు. సో పేటీఎం డీల్‌తో సాఫ్ట్ బ్యాంక్ భారీ నష్టాన్ని పొందనుంది. మరి మన ఇన్వెస్టర్లు ఈ ధరలో అంటే రూ. 555 వద్ద పేటీఎం షేర్‌ను కొనుగోలు చేయొచ్చేమో చూడండి.