ద్రవ్యోల్బణం తగ్గడంతో జోష్
పీపీఐ ఆధార టోకు ధరల సూచీ 8 శాతానికి క్షీణించింది. అంటే ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతోందన్న మాట. దీంతో ఈక్విటీ మార్కెట్లలో జోష్ నెలకొంది. యూరో మార్కెట్లన్నీ ఒక మోస్తరు లాభాలతొ క్లోజ్ కాగా, ఆకర్షణీయ లాభాలతో వాల్‌స్ట్రీట్ ప్రారంభమైంది. డాలర్ స్థిరంగా ఉన్నా… ద్రవ్యోల్బణ డేటాతో ఇక ఫెడ్ వడ్డీరేట్లను భారీగా పెంచకపోవచ్చని అంచనాలు మొదలయ్యాయి. దీంతో నాస్డాక్ 2.31 శాతం లాభంతో ట్రేడవుతుండగా, ఎస్ అండ్ పీ 500 సూచీ 1.41 శాతం పెరిగింది. వాల్‌మార్ట్ షేర్ 6 శాతంపైగా పెరగడంతో టార్గెట్ వంటి ఇతర రీటైల్ కంపెనీల షేర్లు పెరిగాయి. ఎకానమీ షేర్లు బలపడటంతో డౌజోన్స్ కూడా 0.62 శాతం పెరిగింది. క్రూడ్ స్థిరంగా ఉంది. బులియన్ లో వెండి రెండున్నర శాతం తగ్గింది.