For Money

Business News

బంగారంపై బేస్‌ దిగుమతి ధర పెంపు

అంతర్జాతీయ మార్కెట్‌లో బులియన్‌ ధరలు పెరుగుతుండటంతో వీటి దిగుమతిపై సుంకం విధించేందుకు బేస్‌ ప్రైజ్‌ను కేంద్ర ప్రభుత్వం పెంచింది.ఇప్పటి వరకు పది గ్రాముల బంగారం దిగుమతి ధర 531 డాలర్లు ఉండేది. దిగుమతి చేసుకునే బంగారం ధర ఇప్పటి వరకు 531 డాలర్లుగా లెక్కించి దానిపై దిగుమతి సుంకం విధించేవారు. ఇపుడు పది గ్రాముల ధరను 570 డాలర్లుగా పరిగణించి దిగుమతి సుంకం విధిస్తారు. అంటే ఇక నుంచి బంగారం దిగుమతి చేసుకుంటే అధిక దిగుమతి సుంకం చెల్లించాల్సి ఉంటుంది. అలాగే కిలో వెండి ధరను ఇప్పటి వరకు 630 డాలర్లుగా పరిగణించి దిగుమతి సుంకం విధించేవారు. ఇక నుంచి 702 డాలర్లుగా లెక్కించి దిగుమతి సుంకం విధిస్తారు. వీటితో పాటు ఆర్‌బీడీ పామోలిన్‌పై కూడా దిగుమతి సుంకం విధించే ధర పెంచారు.