For Money

Business News

కేన్స్‌ టెక్‌… ఐపీఓకు దరఖాస్తు చేశారా?

ఈ వారం నాలుగు ఐపీఓలు పబ్లిక్‌ ఇష్యూకు వచ్చాయి. ఆర్కీన్‌ కెమికల్స్‌ పబ్లిక్‌ ఇష్యూ ఇవాళే క్లోజైంది. ఈ ఇష్యూ 32.23 రెట్లు ఓవర్ సబ్‌స్క్రయిబ్‌ అయింది. మిగిలిన మూడు ఐపీఓలలోఫస్ట్‌స్టార్‌ బిజినెస్‌ ఫైనాన్స్‌ పబ్లిక్‌ ఆఫర్‌కుఇవాళ 48 శాతం సబ్‌స్క్రయిబ్‌ అయింది. ఐనాక్స్ గ్రీన్‌ పబ్లిక్‌ ఆఫర్‌ కూడా ఇవాళ ప్రారంభమైంది. ఈ ఇష్యూ 12 శాతామే సబ్‌స్క్రిప్షన్‌ లభించింది. ఈ కంపెనీ నష్టాల్లో ఉన్నందున ఇన్వెస్టర్లు దరఖాస్తుకు జంకుతున్నారు. కొంత మంది బ్రోకర్లు మాత్రం దీర్ఘకాలానికి దరఖాస్తు చేయొచ్చని అంటున్నారు. ఇవి కాకుండా
నిన్న ప్రారంభమైన కేన్స్‌ టెక్నాలజీస్‌ పబ్లిక్‌ ఆఫర్‌ను బ్రోకర్లు సిఫారసు చేస్తున్నారు.ఈ ఆఫర్‌ ఇవాళ అంటే రెండో రోజు పూర్తిగా సబ్‌స్క్రయిబ్‌ అయింది. అయితే రీటైల్‌ విభాగం మాత్రం 87 శాతం సబ్‌స్క్రయిబ్‌ అయింది. ఈ ఇష్యూ వచ్చే సోమవారం క్లోజ్‌ కానుంది. ఈ ఇష్యూ బ్రోకింగ్‌ సంస్థలు మంచి రేటింగ్‌ ఇస్తున్నాయి. లిస్టింగ్‌ లాభాలతో పాటు దీర్ఘకాలానికి కూడా ఈ ఇష్యూ మంచి ప్రతిఫలాలను ఇస్తుందని అంటున్నారు. అనేక రంగాలకు ఐటీ సేవలకు అందించే ఈ కంపెనీ రూ. 559 – రూ. 587 రేంజ్‌తో షేర్లను ఆఫర్‌ చేస్తోంది. షేర్ల అలాట్‌మెంట్‌ ఈనెల 17న చేస్తారు.22వ తేదీన లిస్ట్‌ అవుతుంది. స్వల్ప, దీర్ఘకాలిక ఇన్వెస్టర్లకు ఇది మంచి ఆఫర్‌గా చెప్పొచ్చు. ఐటీ రంగానికి చెందిన అనేక షేర్లకు మున్ముందు అప్‌ట్రెండ్‌కు ఛాన్స్‌ ఉన్నందున ఈ షేర్‌కు కూడా మంచి ధర రావొచ్చు.