కోలుకున్నా… నష్టాల్లోనే
ఇవాళ పరిస్థితి చాలా చిత్రంగా ఉంది. సూచీలు పెరిగాయి. షేర్ల ధరలు క్షీణించాయి. కొన్ని షేర్లు ఒక మోస్తరుగా పెరగడంతో సూచీల నష్టాలు తక్కువగా కన్పిస్తున్నాయి. కాని అనేక షేర్లు ఇవాళ నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లు నష్టాల్లో ఉండటంతో… మన మార్కెట్లు కూడా ఆరంభం నుంచి నష్టాల్లోనే ఉన్నాయి. మిడ్ సెషన్ సమయంలో నిఫ్టి 18000 దిగువకు చేరి 17969ని తాకింది. కాని చివర్లో కోలుకుని 18028 పాయింట్ల వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 129 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టి నెక్ట్స్, నిఫ్టి మిడ్ క్యాప్ సూచీలు ఒక శాతం పైగా నష్టపోయాయి. ఇక బ్యాంక్ నిఫ్టి మాత్రం 0.43 శాతం నష్టంతో ముగిశాయి. ఇవాళ హీరో మోటోకార్ప్ టాప్ గెయినర్ కాగా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తరువాతి స్థానంలో ఉంది.ఫలితాలు నిరాశాజనకంగా ఉన్నందున టాటా మోటార్స్ నష్టాల్లో ముగిసింది. యాక్సిస్బ్యాంక్లో తనకు ఉన్న వాటాను ప్రభుత్వం అమ్ముతున్నందున ఆ షేర్లోనూ ఒత్తిడి వచ్చింది. బోనస్ షేర్ల జారీ తరవాత నైకా ఇవాళ 5 శాతంపైగా లాభంతో రూ. 185 వద్ద ముగిసింది. గ్లాండ్ ఫార్మా 4 శాతంపైగా నష్టోయింది.