కేక రూ.470 కోట్ల సేకరణ
హైదరాబాద్‌కు చెందిన మానవ వనరుల స్టార్టప్ ‘కేక’ సీరిస్-ఏ ఫండింగ్‌లో భాగంగా వెస్ట్‌బ్రిడ్జ్ క్యాపిటల్ నుంచి 57 మిలియన్ డాలర్ల(రూ.470 కోట్లు) నిధులను సమీకరించింది. ఈ విషయాన్ని కంపెనీ ఫౌండర్, సీఈవో విజయ్ యలమంచలి తెలిపారు. సాస్ విభాగంలో ఈ స్థాయిలో నిధులు సేకరించడం ఇదే తొలిసారని ఆయన పేర్కొన్నారు. 2016లో స్టార్టప్ సేవలను ఆరంభించిన సంస్థ..అనతికాలంలోనే దేశీయ, అంతర్జాతీయ కస్టమర్లను ఆకట్టుకుంది. 6,500 సంస్థలకు హెచ్ఆర్ సేవలు అందిస్తున్నట్లు విజయ్ చెప్పారు. మరోవైపు, ప్రస్తుతం సంస్థలో 500 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తుండగా, వచ్చే ఏడాదికాలంలో ఈ సంఖ్యను 1,000కి పెంచుకోనున్నట్లు ఆయన ప్రకటించారు.