For Money

Business News

ఆల్ టైమ్‌ హై దిశగా నిఫ్టి

బ్యాంక్‌ నిఫ్టితో పాటు నిఫ్టిలు ఆల్‌టైమ్‌ హై దిశగా పయనిస్తున్నాయి. ప్రస్తుత స్థాయిలో సూచీలు నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్ట్‌ సుదర్శన్‌ సుఖాని అంటున్నారు. అమెరికా మార్కెట్లు ముఖ్యంగా డౌజోన్స్‌ చాలా బలంగా ఉంది. మన మార్కెట్లలో కూడా నిఫ్టితో పాటు బ్యాంక్‌ నిఫ్టిలకు మద్దతు కొనసాగనుంది. మధ్యంలో కాస్త హెచ్చుతగ్గులు ఉన్నా… నిఫ్టి ఆల్‌ టైమ్‌ హై వైపు పయనిస్తోందని ఆయన అంటున్నారు. ప్రస్తుత స్థాయిలో కాకున్నా… పడినపుడల్లా నిఫ్టిని కొనుగోలు చేయొచ్చని అంటున్నారు. సూచీలు పెరిగినపుడల్లా అమ్మకాల ఒత్తిడి వస్తోందని… అయినా ముందుకు సాగే అవకాశాలు అధికంగా ఉన్నాయని ఆయన అన్నారు. బ్యాంక్‌ నిఫ్టి 2023లో 50000 మార్క్‌ను క్రాస్ చేస్తుందని సీఎన్‌బీసీ ఆవాజ్‌ మేనేజింగ్‌ ఎడిటర్‌ అనూజ్‌ సింఘాల్‌ అంటున్నారు. ముఖ్యంగా బ్యాంక్‌ షేర్లు బాగా రాణిస్తాయని అంటున్నారు. మార్కెట్‌ వెంటనే ఆల్‌టైమ్‌కి చేరే అవకాశం లేదని… దీంతో పడినపుడల్లా కొనడం మంచిదన ఆయన సలహా ఇస్తున్నారు.