నిఫ్టి మళ్ళీ 15,650 దిగువన
నిఫ్టి ఇవాళ ప్రధాన మద్దతు స్థాయిలను తాకడం విశేషం. తొలుత 15,680, ఆ తరవాత 15,580ని కూడా టచ్ చేయడం… చూస్తుంటే నిఫ్టి బలహీనపడుతున్నట్లు అనిపిస్తోంది. నిన్న భారీగా క్షీణించిన యూరో మార్కెట్లు ఇవాళ కోలుకున్నాయి. అమెరికా ఫ్యూచర్స్ కూడా అర శాతం పైన లాభాల్లో ఉన్నా… నిఫ్టి 15,650 దిగువన క్లోజైంది. ఉదయం కనిష్ఠ స్థాయి 15,578 ని తాకిన నిఫ్టి యూరో మార్కెట్ పుణ్యమా అని కాస్త కోలుకుంది. కాని ఈ ఆర్థిక సంవత్సరం వస్తున్న తొలి త్రైమాసిక ఫలితాలు మార్కెట్‌ను కంగారు పట్టిస్తున్నాయి. దీంతో నిఫ్టి 120 పాయింట్ల నష్టంతో 15,632 వద్ద ముగిసింది. ఇటీవల నిఫ్టికి గట్టిగా మద్దతు ఇచ్చిన మెటల్స్, రియాల్టీ షేర్లు భారీగా క్షీణించాయి. ఇక ప్రైవేట్ బ్యాంక్‌ల పతనం ఇవాళ కూడా కొనసాగింది. బ్యాంక్ నిఫ్టి రికార్డు స్థాయిలో రెండు శాతం దాకా నష్టపోయింది. నిఫ్టి కేవలం 0.76 శాతం క్షీణించగా, మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.67 శాతం క్షీణించడాన్ని బట్టి చూస్తే మార్కెట్లో అమ్మకాల జోరు అధికంగా ఉందని తెలుస్తోంది. నిఫ్టిలో 40 షేర్లు నష్టాల్లో ముగిశాయంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
నిఫ్టి టాప్ గెయినర్స్
ఏషియన్ పెయింట్స్ 3,145.05 5.47
అల్ట్రాటెక్ సిమెంట్ 7,441.95 1.77
హిందుస్థాన్ లీవర్ 2,432.00 0.97 మారుతీ 7,220.00 0.76
గ్రాసిం 1,570.00 0.72
నిఫ్టి టాప్ లూజర్స్
హిందాల్కో 382.20 -3.72
ఇండస్ ఇండ్ బ్యాంక్ 983.45 -3.19
టాటా స్టీల్ 1,231.95 -2.72
ఎన్టీపీసీ 118.25 -2.59
భారతీ ఎయిర్టెల్ 525.30 -2.44