For Money

Business News

స్థిరంగా SGX NIFTY

అంతర్జాతీయ మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి. రాత్రి అమెరికా మార్కెట్లు నష్టాలతో క్లోజ్‌కాగా ఆసియా మార్కెట్లు గ్రీన్లో ట్రేడవుతున్నాయి. రాత్రి అమెరికా మార్కెట్‌లో డాలర్‌తో పాటు బాండ్ ఈల్డ్స్‌ పెరిగాయి. దీంతో ఐటీ షేర్లలో ఒత్తిడి కొనసాగుతోంది. నాస్‌ డాక్‌, ఎస్‌ అండ్‌ పీ 500 సూచీలు ఒక శాతం పైగా నష్టంతో ముగిశాయి. ఎకనామీ షేర్లలో తక్కువ ఒత్తిడి ఉండటంతో డౌజోన్స్‌ 0.46 శాతం నష్టంతో ముగిసింది. ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు గ్రీన్‌లో ఉన్నాయి. నిన్న సెలవు కావడంతో నిక్కీ ఇవాళ రెండు శాతం నష్టంతో ఉంది. మిగిలిన మార్కెట్లన్నీ గ్రీన్లో ఉన్నాయి. ప్రధాన చైనా మార్కెట్లు ఒక శాతం లాభంతో ట్రేడవుతుండగా, హాంగ్‌సెంగ్‌ మూడు శాతం లాభంతో ట్రేడవుతోంది. క్రితం ముగింపు వద్దే ట్రేడవుతోంది సింగపూర్ నిఫ్టి. సో… నిఫ్టి స్థిరంగా ప్రారంభం కావొచ్చు.