పడినా… కోలుకున్న నిఫ్టి
సింగపూర్ నిఫ్టికి భిన్నంగా నిఫ్టి స్వల్ప నష్టాలతో ప్రారంభమైంది. 17,959 పాయింట్లకు పడినా వెంటనే కోలుకుని 18007 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 76 పాయింట్ల నష్టంతో ఉంది. ఎఫ్ఎమ్సీజీ గ్రూప్ షేర్లు నిఫ్టికి మద్దతుగా నిలిచాయి. ఐటీ షేర్లు ఇవాళ దారుణంగా దెబ్బతీశాయి. ఐటీ సూచీ రెండు శాతం క్షీణించింది. నిఫ్టితో పాటు ప్రధాన ఇతర సూచీలు నష్టాల్లో ఉన్నాయి. తొలి డిప్‌ను మార్కెట్ కొనుగోలు చేసింది… కాని రెండో డిప్‌ను కొనుగోలు చేస్తుందా అన్నది చూడాలి. ఎందుకంటే పెద్ద ఇన్వెస్టర్లు తమ పొజిషన్స్ క్లియర్ చేసుకునేందుకు వీలుగా నిఫ్టిని ఉంచుతుంటారు. కాబట్టి గంట తరవాత నిఫ్టిపై ఒత్తిడి చూడొచ్చు. వీక్లీ డెరివేటివ్స్ క్లోజింగ్ ఉన్నందున నిఫ్టి ఎలా బిహేవ్ చేస్తుందో చూడాలి. తొందర పడి మాత్రం కొనుగోలు చేయొద్దు. నిఫ్టి 17900 లేదా 17950 ప్రాంతంలోనే కొనుగోలు చేయండి. అపుడు కూడా స్టాప్‌లాస్ 17900 ప్రాంతంలో ఉంచుకోవాలని అనలిస్టులు సూచిస్తున్నారు. నిఫ్టిలో 40 షేర్లు నష్టాల్లో ఉన్నాయి. సిమెంట్ షేర్లు ఇవాళ స్థిరంగా ఉన్నాయి. హిందాల్కోతో పాటు ఐటీ షేర్లు నిఫ్టి టాప్ లూజర్స్‌లో ఉన్నాయి. ఇటీవల ఐటీ షేర్లలో వచ్చిన ర్యాలీకి ఫుల్స్టాప్ పడినట్లు కన్పిస్తోంది. సో… నిఫ్టి రెండో డిప్ వస్తుందేమో చూడండి.