హెచ్డీఎఫ్సీ బ్యాంక్… ఎన్నాళ్ళకు!
హెచ్డీఎఫ్సీ ట్విన్స్ విలీన సమయంలో దాదాపు రూ. 1722ని దాటిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఆ తరవాత రూ.1271ని తాకింది. అక్కడి నుంచి అనేక నెలలు రూ. 1300 నుంచి రూ.1400 మధ్య కదలాడింది. గత రెండేళ్ళుగా ఈ షేర్ ధరలో పెద్దగా మార్పు లేదు. ఆ తరవాత భారీ అమ్మకాల ఒత్తిడికి లోనైంది. దీనికి ప్రధాన కారణం విదేశీ ఇన్వెస్టర్లు ఈ కౌంటర్లో భారీగా అమ్మకాలకు పాల్పడటమే. ఈ కౌంటర్లో విదేశీ ఇన్వెస్టర్లది కీలక పాత్ర. ఇపుడు మళ్ళీ ఈ కౌంటర్ విదేశీ ఇన్వెస్టర్ల ఆసక్తి కన్పిస్తోంది. పైగా హెచ్డీఎఫ్సీ ట్విన్స్ విలీన ప్రక్రియ కూడా దాదాపు పూర్తి కావొస్తోంది. దీంతో విదేశీ ఇన్వెస్టర్లు ఈ షేర్లో ఆసక్తి చూపుతున్నారు. పైగా వచ్చే ఏడాది బ్యాంక్ నిఫ్టి ఆల్టైమ్ రికార్డును సాధించడంతో పాటు 45,000ను దాటుతుందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్ రూ.1850 లేద రూ. 1900ని క్రాస్ చేస్తుందని అంచనా వేస్తున్నారు.