NIFTY TRADE: దిగువస్థాయిలో ఛాన్స్!
మార్కెట్ ఇవాళ స్థిరంగా ప్రారంభం కానుంది. నిఫ్టి క్రితం ముగింపు 15,752. ఇతర మార్కెట్లతో పోలిస్తే మన మార్కెట్లలో నష్టం తక్కువే అని చెప్పాలి. ఉదయం నుంచి అమెరికా ఫ్యూచర్స్ గ్రీన్‌లో ఉన్నా… ఆసియా మార్కెట్లన్నీ నష్టాల్లో ఉన్నాయి. కారణం.. రాత్రి అమెరికా మార్కెట్లు భారీ నష్టాలతో క్లోజ్ కావడమే. ఈ నేపథ్యంలో నిఫ్టి దాదాపు క్రితం ముగింపుస్థాయిలోనే ఓపెన్ కానుంది. నిఫ్టి ఇక్కడి నుంచి రెండు వైపులా ఛాన్స్ ఇవ్వనుంది. నిఫ్టికి తదుపరి మద్దతు 15708. ఈ స్థాయి కోల్పోతే మాత్రం 15,680 వరకు మద్దతు లేదు. పడితే ఈ స్థాయిలో 15 పాయింట్ల స్టాప్ లాస్‌తో కొనుగోలు చేయండి. దిగువస్థాయిలో నిఫ్టికి మద్దతు అందితే మళ్ళీ క్రితం ముగింపు స్థాయి అంటే 15752ని దాటే అవకాశముంది. నిఫ్టి గనుక ఓపెనింగ్‌లో లాభాల్లోకి వస్తే తొలి ప్రతిఘటన 15775. ఈ స్థాయిని దాటితే 15,825. ఆ తరవాత 15,870. 15,680 నుంచి 15,825 మధ్య కదలాడే అవకాశముంది. మిడ్ సెషన్‌లోపే నిఫ్టి ఇవాళ్టి కనిష్ఠ స్థాయిని తాకే అవకాశముంది. ఆ స్థాయిలో కొనుగోలు చేయడం మంచిది. అమెరికా ఫ్యూచర్స్ అనుగుణంగా యూరో మార్కెట్ పుంజుకుంటే నిఫ్టి మిడ్‌సెషన్ తరవాత గరిష్ఠ స్థాయిని తాకే అవకాశముంది. నిఫ్టి ఓపెనింగ్ లేదా మిడ్ సెషన్ లోపల పడితే కొనేందుకు ప్రయత్నించండి. డే ట్రేడర్స్ మిడ్ సెషన్ తరవాత బయటపడటం మంచిది.