ఇక బ్లూ టిక్ 20 డాలర్లు?
ఎలాన్ మస్క్ వచ్చీ రాగానే ట్విటర్లో మార్పులు ప్రారంభించాడు. కొత్తగా ఎవరికైనా బ్లూ టిక్ కావాలంటే సబ్స్క్రిప్షన్ కింద 19.99 డాలర్లను చెల్లించాలని ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ప్రస్తుత ప్లాన్ ప్రకారం ఇపుడున్నవారు ఎవరైనా సరే బ్లూ సబ్స్క్రిప్షన్ కావాలంటే ఈ మొత్తం చెల్లించాల్సిందే. వెరిఫైడ్ యూజర్లకు 90 రోజుల గడువు ఇస్తున్నారు. లేదంటే బ్లూ చెక్ మార్క్ పోతుంది. అలాగే ట్విటర్లో అదనపు ఫీచర్స్ కావాలంటే నెలకు 4.99 డాలర్లు చెల్లించాలి. ఇది ఐచ్ఛికం. అంటే మీకు ఇష్టముంటేనే తీసుకోవచ్చు. కొత్త మార్పులకు సంబంధించి ఆయన ట్విటర్ ఉద్యోగులకు డెడ్లైన్ కూడా విధించినట్లు సమాచారం. కేవలం వారం రోజుల్లో కొత్త నిబంధనలు అమల్లోకి రావాలని.. ఆ మేరకు మార్పులు చేయాలని ట్విటర్ ఉద్యోగులకు ఆదేశించారు. లేకుంటే ఉద్యోగాలు పోయినట్లేనని హెచ్చరించారు. దీనికి సంబంధించిన ఉద్యోగులకు మస్క్ పంపిన నోట్న చూసి ‘ద వెర్జ్’ అనే వెబ్సైట్ ఈ వార్తను రాసింది.