For Money

Business News

బ్రెజిల్‌: అధికారంలోకి లెఫ్ట్‌

బ్రెజిల్‌లో హోరాహోరీగా సాగిన పోరులో వామపక్షాలకు చెందిన లుల డి సిల్వా దేశాధ్యక్షుడిగా ఎన్నియ్యారు. మొత్తం పోలైన ఓట్లలో లులకు 50.9 శాతం ఓట్లు వచ్చాయి. జెయిర్‌ బొల్సొనారో ఓడిపోయారు. 1990 తరవాత అధికారంలో ఉన్న అధ్యక్షుడు రెండోసారి అధికారంలోకి రాకపోవడం ఇదే మొదటిసారి. 2003 నుంచి 2010 వరకు లుల రెండుసార్లు దేశాధ్యక్షుడిగా ఉన్నారు. 2018 ఎన్నికల్లో ఆయనను జైల్లో పెట్డడంతో పాటు ఎన్నికల్లో పోటీకి అనర్హుడిగా ప్రకటించడంతో లుల పోటీ చేయలేదు. ఓ కంపెనీకి కాంట్రాక్ట్‌ ఇచ్చేందుకు లంచం తీసుకున్నారన్న కేసులో ఆయనను జైలుకు పంపారు. అయితే ఆయనపై పెట్టిన కేసు వీగిపోయింది. దీంతో ఈసారి మూడోసారి ఎన్నికల్లో పోటీ చేసి లుల గెలిచారు. మూడోసారి దేశాధ్యక్షుడిగా వచ్చే జనవరి 1న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రెండుసార్లు దేశాధ్యక్షుడు తరవాత జైలుకు మళ్ళీ దేశాధ్యుడిగా లుల చరిత్ర సృష్టించారు.