అంచనాలు మించిన అమెరికా జీడీపీ వృద్ధిరేటు
అమెరికా కేంద్ర బ్యాంకు వరుసగా… భారీగా వడ్డీ రేట్లను పెంచడంతో అమెరికా జీడీపీ వృద్ధిరేటు తగ్గుతుందని విశ్లేషకులు అంచనా వేశారు. సెప్టెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో అమెరికా జీడీపీ వృద్ధి రేటు 2.6 శాతంగా నమోదైంది. ఈ వృద్ధి రేటు 2.4 శాతం ఉంటుందని ఆర్థిక వేత్తలు అంచనా వేశారు. దీంతో అమెరికా ఆర్థిక వ్యవస్థ వెంటనే మాంద్యంలోకి వెళుతుందన్న భయాలు ప్రస్తుతానికి తొలిగాయి. మొదటి త్రైమాసికంలో జీడీపీ 1.6 శాతం క్షీణించగా, రెండో త్రైమాసికంలో 0.6 శాతం క్షీణించింది. మూడో త్రైమాసికంలో 2.6 శాతం వృద్ధి చెందడంతో ఇపుడు బ్యాంకర్లలో టెన్షన్ పెరిగింది. వడ్డీ రేట్లను ఫెడరల్ బ్యాంక్ మరింత అధికంగా పెంచుతుందేమోనన్న చర్చ ఇపుడు అమెరికాలో మొదలైంది.