For Money

Business News

17700 దిగువన క్లోజైన నిఫ్టి

అంతర్జాతీయ మార్కెట్లు బలహీనపడటంతో పాటు రేపు మన మార్కెట్లకు సెలవు కావడంతో నిఫ్టి 74 పాయింట్ల నష్టంతో ముగిసింది. ఎల్లుండి వీక్లీ, మంత్లీ కాంట్రాక్ట్స్‌ కూడా క్లోజ్‌ అవుతున్నందున చివర్లో ఇన్వెస్టరర్లు తమ పొజిషన్స్‌ తగ్గించుకున్నట్లు తెలుస్తోంది. 17800 నుంచి 18000 వరకు భారీ కాల్ రైటింగ్‌ ఉంది. ముఖ్యంగా 17700 వద్ద పుట్‌ రైటింగ్‌ అధికంగా ఉన్నందున గురువారం మార్కెట్‌ ఎలా స్పందిస్తుందో చూడాలి. నిఫ్టి 17656 పాయింట్ల వద్ద ముగిసింది. గత కొన్ని రోజులుగా పెరుగుతూ వచ్చిన బ్యాంక్‌ నిఫ్టి, ఫైనాన్స్‌ సూచీలు ఇవాళ అర శాతం దాకా నష్టంతో ముగిశాయి. నిఫ్టి నెక్ట్స్‌, నిఫ్టి మిడ్‌ క్యాప్‌ సూచీలు మాత్రం స్థిరంగా ముగిశాయి. గతకొన్ని రోజులుగా భారీగా పెరిగి నెస్లే షేర్‌లో ఇవాళ లాభాల స్వీకరణ వచ్చింది. అలాగే బ్రిటానియాలో కూడా. రిలయన్స్‌ కూడా ఫలితాలుకు రియాక్టయి… నష్టాలతో ముగిసింది. టెక్‌ మహీంద్రా ఇవాళ మూడు శాతంపైగా లాభంతో టాప్‌ గెయినర్‌గా నిలిచింది. లారస్‌ ల్యాబ్‌లో ఒత్తిడి కొనసాగుతోంది. ఇవాళ రూ. 27 పడి రూ. 452 వద్ద ముగిసింది. లోకల్‌ షేర్లలో రెయిన్‌ బో చిల్ట్రన్స్‌ హాస్పిటల్స్‌ రూ. 32 పెరిగి రూ. 698 వద్ద ముగిసింది. ఈ షేర్‌ షార్ట్‌ కవరింగ్‌ కారణమని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. అమెరికా ఫ్యూచర్స్‌ నష్టాల్లో ఉన్నాయి… యూరో మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో నిఫ్టి బలహీనంగా ముగిసింది.