బ్రిటన్ ప్రధానిగా రిషి సునాక్
కన్సర్వేటివ్ పార్టీ నాయకునిగా రుషి సునాక్ ఎన్నికయ్యారు. సగానికి పైగా ఎంపీల మద్దతు సాధించిన రిషికి పోటీగా ఎవరు దిగకపోవడంతో రుషి సునాక్‌ను ప్రధాని పదవికి తమ పార్టీ అభ్యర్థిగా కన్సర్వేటివ్ పార్టీ ప్రకటించింది. దీంతో సునాక్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. లిజ్ ట్రస్ రాజీనామా చేయడంతో ఈ పార్టీ తమ తదుపరి ప్రధాని అభ్యర్థిని ఇవాళ ఎన్నుకుంది. రిషికి పోటీగా నిలబడాలని ప్రయత్నించిన పెన్ని మార్డన్స్కు 90 మంది ఎంపీల మద్దతు మాత్రమే లభించింమది. రిషికి పోటీగా నిలబడాలంటే ఆయనకు కనీసం వంద మంది ఎంపీలు సంతకం చేయాల్సి ఉంది. కాని ఆ స్థాయిలో మద్దతు కూడగట్టడంలో పెన్ని విఫలమయ్యారు.దీంతో పోటీ నుంచి వైదొలిగారు.