For Money

Business News

భారీ లాభాల్లో నిఫ్టి

కొద్ది సేపటి క్రితం మూరత్‌ ట్రేడింగ్‌ చాలా ఉత్సాహంగా ప్రారంభమైంది. ఓపెనింగ్‌లో 17,777ని తాకిన నిఫ్టి ఇపుడు 17761 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 185 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. ఇవాళ చైనా, హాంగ్‌కాంగ్‌ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. హాంగ్‌సెంగ్‌ ఏకంగా 6.16 శాతం నష్టపోగా.. చైనా మార్కెట్లు 3 శాతం నుంచి 4 శాతం మధ్య నష్టంతో ముగిశాయి. జపాన్‌ నిక్కీ కేవలం 0.31 శాతం పాయింట్ల లాభంతో ముగిసింది. అయితే యూరో మార్కెట్లలో మాత్రం భారీ లాభాల్లో ట్రేడవుతున్నాయి. యూర స్టాక్స్‌ 50 సూచీ 1.8 శాతం లాభపడింది.  అమెరికా మార్కెట్ల ఫ్యూచర్స్‌ 0.77 శాతం లాభంతో ట్రేడవుతున్నాయి. ఈ నేపథ్యంలో మన మార్కెట్లు కూడా భారీ లాభాల్లో ఉన్నాయి. నిఫ్టితో పాటు అన్ని ప్రధాన సూచీలు లాభాల్లో ఉన్నాయి. బ్యాంక్‌ నిఫ్టి ఏకంగా 1.39 శాతం లాభంతో ఉండగా, నిఫ్టి మిడ్‌ క్యాప్‌ సూచీ 0.75 శాతం లాభంతో ట్రేడవుతోంది. నిఫ్టి నెక్ట్స్‌ కూడా ఇదే స్థాయిలో లాభంతో ఉంది. ఇక నిఫ్టి షేర్లలో ఎల్‌ అండ్‌ టీ, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు రెండు శాతంపైగా లాభంతో ట్రేడవుతున్నాయి. నిఫ్టిలో 48 షేర్లు లాభాల్లో ఉన్నాయి. కేవలం హిందూస్థాన్‌ లీవర్‌, కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.