For Money

Business News

స్థిరంగా SGX NIFTY

అమెరికా ఈక్విటీ మార్కెట్లతో పాటు బులియన్‌ మార్కెట్లను ఇపుడు బాండ్‌ ఈల్డ్స్‌ భయపెడుతున్నాయి. ఈ ఏడాది ఆరంభం పదేళ్ళ అమెరికా ట్రెజరీ బాండ్‌పై ఈల్డ్స్‌ 3.5 శాతం ప్రాంతంలో ఉండగా రాత్రి 4.23 శాతానికి చేరాయి. ఇటీవల వరకు 3.9 శాతం ఉన్న బాండ్ ఈల్డ్స్‌ అనూహ్యంగా పెరుగుతుండటంతో సురక్షిత పెట్టుబడి కోసం ఎదురు చూస్తున్న ఇన్వెస్టర్లు బాండ్‌ మార్కెట్‌వైపు పరుగులు తీస్తున్నారు. మాంద్యం కారణంగా షేర్‌ మార్కెట్‌లో పెద్ద ప్రతిఫలాలు ఉండవని అనలిస్టులు హెచ్చరిస్తుండటంతో బాండ్‌ మార్కెట్‌లో డిమాండ్ పెరుగుతోంది. రాత్రి వాల్‌స్ట్రీట్‌ మూడు సూచీలు నష్టాల్లో ముగిశాయి. ఎస్‌ అండ్ పీ 500 సూచీ అత్యధికంగా 0.8 శాతం, తరవాత నాస్‌డాక్‌ 0.61 శాతం, డౌజోన్స్‌ 0.3 శాతం నష్టంతో ట్రేడవుతున్నాయి. డాలర్‌ ఇండెక్స్‌ కూడా 113 ప్రాంతంలో ఉంది. క్రూడ్‌ నిలకడగా ఉంది. ఈ నేపథ్యంలో ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి. కొన్ని మార్కెట్లు లాభాల్లో.. మరికొన్ని నష్టాల్లో ఉన్నాయి. అయితే లాభనష్టాలు నామ మాత్రంగా ఉన్నాయి. దీంతో సింగపూర్‌ నిఫ్టి కూడా 20 పాయింట్ల నష్టంతో ఉంది. సో నిఫ్టి స్థిరంగా ప్రారంభమయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి.