For Money

Business News

గ్రాన్యూల్స్‌ లాభం రూ.145 కోట్లు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికి గ్రాన్యూల్స్‌ ఇండియా రూ.145 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ఏడాది క్రితం ఇదే కాలం లాభం రూ.81 కోట్లతో పోలిస్తే 80 శాతం అధికమని కంపెనీ వెల్లడించింది. ఏకీకృత ప్రాతిపదికన టర్నోవర్‌ కూడా 30 శాతం వృద్ధితో రూ.888 కోట్ల నుంచి రూ.1,151 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయంలో అమెరికా నుంచి లభించిన ఆదాయం 53.8 శాతం నుంచి 57.8 శాతానికి పెరిగినట్లు గ్రాన్యూల్స్‌ ఇండియా సీఎండీ కృష్ణ ప్రసాద్‌ చిగురుపాటి తెలిపారు.కంపెనీ రుణ భారం కూడా రూ. 544 కోట్లకు తగ్గిందన్నారు. పారాసెట్మాల్‌ డిమాండ్‌ కొనసాగుతుందని, ఐరోపా దేశాలకు విస్తరిస్తున్నందున భవిష్యత్తులో ఆదాయాలు, లాభాలు బాగా పెరుగుతాయన్న ఆశాభావాన్ని కృష్ణ ప్రసాద్‌ వ్యక్తం చేశారు.