For Money

Business News

అందరి నోటా పిడిలైట్‌

గత కొన్ని రోజుల నుంచి మార్కెట్‌లో పిడిలైట్‌ హాట్ టాపిక్‌గా మారింది. అనేక మంది బ్రోకర్లు ఈ షేర్‌ను రెకమెండ్‌ చేస్తున్నారు. రూ. 2300 స్టాప్‌లాస్‌తో రూ. 2900 టార్గెట్‌తో కొనుగోలు చేయమని సలహా ఇస్తున్నారు. దీనికి ఒక కారణం మార్కెట్‌ పాజిటివ్‌గా ఉండటం.. రెండోది ఈ షేర్‌ నిఫ్టిలోకి వస్తుందనే ప్రచారం. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ విలీనం తరవాత హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కు నిఫ్టిలో వెయిటేజీని మరింత పెంచుతారని.. ఇదే సమయంలో హెచ్‌డీఎఫ్‌సీని తొలగిస్తారని తెలుస్తోంది. దీంతో హెచ్‌డీఎఫ్‌సీ స్థానంలో ఏ షేర్‌కు స్థానం లభిస్తుందనే చర్చ జరుగుతోంది మార్కెట్‌లో. చాలా మంది అనలిస్టులు పిడిలైట్‌ షేర్‌ వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో ఈ షేర్‌కు డిమాండ్‌ పెరుగుతోంది.