NIFTY TRADE: పడితే కొనొచ్చా?
మూడు ప్రధాన పబ్లిక్ ఇష్యూలు ఈవారం మార్కెట్‌కు రానున్నాయి. జొమాటొ మినహా మిగిలిన రెండు కంపెనీలు ఫండమెంటల్స్ పరంగా చాలా పటిష్ఠమైనవి. సో… పబ్లిక్ ఆఫర్ల కోసమైనా… మార్కెట్ గ్రీన్‌లో ఉంచుతారు. డాలర్ ఇండెక్స్ 93కి చేరింది, క్రూడ్ 76.50 డాలర్లుగా ఉంది. లిక్విడిటీ కారణంగా మార్కెట్ వీటిని పట్టించుకోవడం లేదు. కాని కంపెనీ పనితీరును ఇవి బాగా దెబ్బతీసే అవకాశముంది. ఈ నేపథ్యంలో మార్కెట్ తీవ్ర ఒడుదుడులకు లోనవుతోంది. అందుకే ఒక రేంజ్‌కే నిఫ్టి పరిమితమైంది. నిఫ్టి క్రితం ముగింపు 15,812. సింగపూర్ నిఫ్టి 50 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. ఇదే స్థాయి నష్టాలతో నిఫ్టి ప్రారంభం కాకపోవచ్చు. స్థిరంగా ప్రారంభమయ్యే అవకాశాలే అధికంగా ఉన్నాయి. సో… నిఫ్టి ఒక వేళ పడినా కొనుగోలు చేయొచ్చు. కాని నిఫ్టి గనుక ఆరంభంలోనే పెరగడం ప్రారంభమైతే… వెయిట్ చేయండి. ఎందుకంటే 15,860 దాకా నిఫ్టికి పెద్ద అవరోధం లేదు. తొలుత నిఫ్టి ఈ స్థాయికి వస్తే 15,880 స్టాప్‌లాస్‌తో అమ్మండి. నిఫ్టి ఈ స్థాయిని దాటితో ట్రేడింగ్‌కు దూరంగా ఉండండి. నిఫ్టికి ఏమాత్రం ఒత్తిడి వచ్చినా వెంటనే 15,775 వద్ద మద్దతు లభించే అవకాశముంది. అధిక స్థాయిలో అమ్మేవారు ఇక్కడ నిఫ్టిని గమనించండి. వీక్‌గా ఉంటే 15750కి పడే అవకాశముంది. ఇదే జరిగితే 15,740-15,730 స్టాప్‌లాస్‌తో కొనుగోలు చేయండి. నిఫ్టిలో భారీ నష్టాలకు ఛాన్స్ లేదు. అలాగే లాభాలకు కూడా. సో… నిఫ్టి రేంజ్ 15,750-15,870. డే ట్రేడర్స్‌కు రెండు వైపులా అవకాశముంది.