నష్టాలతో ప్రారంభం కానున్న నిఫ్టి
అంతర్జాతీయ మార్కెట్లు నిస్తేజంగా మారాయి. ముఖ్యంగా నిన్న రాత్రి అమెరికా డాలర్ భారీగా పెరిగింది. డాలర్ ఇండెక్స్ 93 తాకడానికి సిద్ధంగా ఉంది. మిశ్రమంగా ప్రారంభమైన అమెరికా మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. మూడు సూచీలు 0.4 శాతం నష్టంతో ముగిశాయి. ఇక ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు కూడా నష్టాల్లో ట్రేడవుతున్నాయి. నిన్న భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు ఇవాళ ఒక మోస్తరు నష్టాలతో ఉన్నాయి. చైనా మార్కెట్లు ఒక శాతం దాకా నష్టాల్లో ఉన్నాయి. హాంగ్‌సెంగ్ అరశాతం నష్టంతో ట్రేడవుతోంది. సింగపూర్ నిఫ్టి ప్రస్తుతం 55 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. నిఫ్టి కూడా ఒక మోస్తరు నష్టాలతో ప్రారంభమయ్యే అవకాశముంది.