సువెన్ లైఫ్ రైట్స్ ఇష్యూ
సువెన్ లైఫ్ సైన్సెస్ రైట్స్ ఇష్యూ జారీ చేయనుంది. అర్హులైన వాటాదారులకు 7,26,91,239 షేర్లను జారీ చేయనుంది. రూపాయి ముఖవిలువ కలిగిన ఒక్కో షేర్‌ను రూ.54 ప్రీమియంతో అంటే రూ.55కి జారీ చేస్తారు. ఇష్యూ ద్వారా సువెన్ లైఫ్ రూ.399.8 కోట్లను సమీకరిస్తుంది. వాటాదారుల వద్ద ఉన్న ప్రతి రెండు షేర్లకు ఒక షేర్‌ను కంపెనీ జారీ చేస్తుంది. షేర్ల జారీకి రికార్డు తేదీ అక్టోబరు 18.