For Money

Business News

హెచ్‌సీఎల్‌ టెక్‌ ఫలితాలు సూపర్‌

విప్రో ఫలితాలు ప్రకటించిన కాస్సేపటికే హెచ్‌సీఎల్‌ టెక్‌ ఫలితాలు కూడా వచ్చేశాయి. సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలంలో హెచ్‌సీఎల్‌ టెక్‌ రూ.న 24,686 కోట్ల టర్నోవర్‌పై రూ. 3490 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. సీఎన్‌బీసీ టీవీ18 పోల్‌లో పాల్గొన్న విశ్లేషకులు కంపెనీ రూ. 24465 కోట్ల టర్నోవర్‌పై రూ. 3144 కోట్ల నికర లాభం ఆర్జిస్తుందని అంచనా వేశారు. ఈ లెక్కన మార్కెట్‌ అంచనాలను కంపెనీ అధిగమించింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే కంపెనీ ఆదాయం 6.3 శాతం పెరగ్గా, నికర లాభం 5.2 శాతం పెరిగింది. ఎబిటా కూడా 10.9 శాతం పెరిగింది.