For Money

Business News

గ్యాస్‌ సబ్సిడీకి రూ.22,000 కోట్లు

గత రెండేళ్ళ నుంచి ఆయిల్ మార్కెటింగ్‌ కంపెనీలు ఎల్‌పీజీ గ్యాస్‌ను నష్టాలకు అమ్ముతున్నాయని… దీంతో వాటిలో కొంత భాగాన్ని భరించేందుకు కేంద్రం రూ.22,000 కోట్ల సబ్సిడీని ఇవ్వాలని నిర్ణయించింది. ఇవాళ ప్రధాని మోడీ నేతృత్వంలో సమావేశమైన కేంద్ర కేబినెట్‌ ఈ నిర్ణయం తీసుకుంది. కేబినెట్‌ నిర్ణయాలను కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ మీడియాకు వివరించారు. రైల్వే ఉద్యోగులకు 78 రోజుల జీతాన్ని బోనస్‌గా ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. అయితే ఈ బోనస్‌ను ఉత్పాదకతతో ముడి పెట్టారు. ఈ లెక్కన గరిష్ఠంగా ఉద్యోగికి వచ్చే బోనస్‌ రూ. 17,951. 11.27 మంది రైల్వే ఉద్యోగులకు రూ. 1832 కోట్ల మేరకు బోనస్‌ ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు.