15,800ని నిఫ్టి తాకేనా?
చిన్న ఫైనాన్స్ బ్యాంకులు తమ మాతృ సంస్థల్లో విలీనం కావొచ్చన్న (రివర్స్ మెర్జర్) ఆర్బీఐ నిర్ణయంతో బ్యాంకింగ్ షేర్లలో ఆసక్తి కనబర్చింది. స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ షేర్లు భారీ లాభాల్లో ట్రేడవుతున్నాయి. అలాగే మెటల్స్‌కు ఇవాళ కూడా మద్దతు అందడంతో నిఫ్టి ఇవాళ ఓపెనింగ్‌లోనే 15,779 స్థాయిని తాకింది. ఇదే స్థాయి వద్ద ఒత్తిడి రావడంతో కొన్ని నిమిషాల్లో 15,746 స్థాయికి చేరింది. దిగువ స్థాయలో మద్దతు అందడంతో నిఫ్టి మళ్ళీ 15,776 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 87 పాయింట్లు లాభపడింది. నిఫ్టిలో ఏకంగా 46 షేర్లు గ్రీన్‌లో ఉన్నాయి. కాని నిఫ్టి అరశాతం కూడా లాభపడటలేదు. అంటే లాభాలన్నీనామ మాత్రంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో నిఫ్టి 15,800 స్థాయిని ఇవాళ తాకుతుందా అనేది చూడాలి. ఎందుకంటే శుక్రవారం భారీ లాభాలతో ముగిసిన యూరో మార్కెట్లు ఎలా ఓపెన్ అవుతాయో చూడాలి. అమెరికా ఫ్యూచర్స్ నష్టాల్లో ఉన్నాయి. నిఫ్టి ఏమాత్రం పెరిగినా… 15800 దరిదాపుల్లోకి వెళితే స్వల్ప లాభాలతో కోసం అమ్మడం వినా… మరో మార్గం లేదు.
నిఫ్టి టాప్ గెయినర్స్
అల్ట్రాటెక్ 7,041.25 2.05
మారుతీ 7,550.00 1.67
టాటా కన్జూమర్ 778.35 1.62
ఐసీఐసీఐ బ్యాంక్ 648.85 1.61
గ్రాసిం 1,523.10 1.53
నిఫ్టి టాప్ లూజర్స్
బజాజ్ ఫిన్ సర్వ్ 12,780.00 -0.58
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 1,495.00 -0.47
హెచ్‌యూఎల్ 2,444.40 -0.29
హిందాల్కో 389.15 -0.23
బీపీసీఎల్ 455.85 -0.23