For Money

Business News

స్థిరంగా ముగిసిన నిఫ్టి

రోజంతా నష్టాల్లో ఉన్న నిఫ్టి క్లోజింగ్‌కు ముందు గ్రీన్‌లోకి వచ్చింది. చివర్లో లాభాల స్వీకరణ కారణంగా 17314 పాయింట్ల వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 17 పాయింట్లు తగ్గింది. మిడ్‌ సెషన్‌ ముందు నిఫ్టి 17216 పాయింట్లకు తగ్గింది. టెక్నికల్స్‌ ప్రకారం 17200 గట్టి మద్దతు స్థాయి కావడంతో మద్దతు అందింది. పైగా మిడ్‌సెషన్‌లో ప్రారంభమైన యూరో మార్కెట్లు, అమెరికా ఫ్యూచర్స్‌ స్థిరంగా ఉండటంతో మన మార్కెట్లు కోలుకున్నాయి. ఇతర ప్రధాన సూచీలన్నీ నష్టాల్లో ముగిసినా… నష్టాలు పరిమితంగానే ఉన్నాయి. నిఫ్టిలో ఉదయం నుంచి టైటాన్‌ టాప్‌ గెయినర్‌గా నిలిచింది. అయిదు శాతంపైగా లాభంతో ఈ షేర్‌ ముగిసింది. ఇక నిఫ్టి నెక్ట్స్‌లో జొమాటో, పేటీఎంలకు గట్టి మద్దతు లభించింది. జొమాటొ దాదాపు ఆరు శాతం పెరగడం విశేషం. మిడ్‌ క్యాప్‌లో జూబ్లియంట్‌ ఫుడ్స్‌, డిక్షన్‌, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ షేర్లు రెండు నుంచి మూడు శాతం నష్టంతో ముగిశాయి.