ఈ రెండు షేర్లు కొనండి
ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్, ఐఐఎఫ్ఎల్ డైరెక్టర్ సంజీవ్ భాసిన్ ఇవాళ రెండు షేర్లను రెకమెండ్ చేశారు. దేశంలో లాజిస్టిక్ పరిశ్రమలో సమూల మార్పులు రానున్నాయి. ఇటీవల ప్రధానిమోడీ కొత్త లాజిస్టిక్ విధానానికి శ్రీకారం చుట్టారు. దీనివల్ల బాగా లబ్ది పొందే కంపెనీల్లో అదానీ పోర్ట్ ఒకటి. బాల్టిక్ రేట్ ఇండెక్స్, చైనా ప్లస్ వన్ … రెండు ఈ కంపెనీకి అనుకూల ఫలితాలు ఇస్తాయని సంజీవ్ భాసిన్ అంటున్నారు. లాజిస్టిక్ రంగంలో పెద్ద బూమ్ రానుందని ఆయన అంచనా వేస్తున్నారు. ఈ షేర్ రూ. 780 స్టాప్‌లాస్‌తో కొనుగోలు చేయాలని ఆయన సలహా ఇచ్చారు. టార్గెట్ రూ.900గా పేర్కొన్నారు. ఆయన సిఫారసు చేసిన మరో షేర్ కాన్కర్. లాజిస్టిక్ బూమ్ కారణంగా బాగా లబ్ది పొందే కంపెనీల్లో కాన్కర్ కూడా ఒకటని సంజీవ్ భాసిన్ అన్నారు. చైనా నుంచి చాలా వ్యాపారం తిరిగి వస్తోందని అన్నారు. ఈ షేర్‌ను కూడా కొనుగోలు చేయొచ్చని ఆయన అన్నారు.