ఇపుడు జీ షేర్లు కొనొచ్చా?
జీ ఎంటర్టైన్మెంట్ షేర్ మంగళవారం ఆరు శాతంపైగా లాభంతో రూ.268 వద్ద ముగిసింది. మార్కెట్ ముగిసిన తరవాత జీ, సోనీ విలీనానికి సీసీఐ ఆమోదం తెలిపింది. దీంతో ఈ షేర్ ఇవాళ ఎంత పెరుగుతుంది? ఈ స్థాయిలో జీ షేర్‌ను కొనుగోలు చేయొచ్చా అన్నది మార్కెట్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ షేర్ రూ.325 వద్ద వరకు వెళ్ళే అవకాశముందని ఆ స్థాయి దాటితే కొనుగోలు చేయడంపై పునరాలోచన చేయానలి సీఎన్‌బీఐ ఆవాజ్ మేనేజింగ్ డైరెక్టర్ అనూజ్ సింఘాల్ అంటున్నారు. ఓటీటీ జీ 5, సోని లివ్ ఉన్నా.. మార్కెట్లో అధికంగా నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీలతో రాజ్యమని అన్నారు. అయితే ఓటీటీ మార్కెట్ జీకి మంచి వాటా ఉందని, అయితే ఇదెంత వరకు ఉపయోగించుకునే అవకాశముందే చూడాల్సి ఉందన్నారు. పలు అంశాల్లో ఈ విలీనం ఎంత వరకు సక్సెస్ అవుతుందనే అంశంపై అనుమానాలు ఉన్నాయని సింఘాల్ అంటున్నారు. దీంతో రూ. 325 వరకు ఈ షేర్ ధర ఫరవాలేదని అనిపిస్తోందని… కాని ఆ పైన కొనుగోలు చేయడం కాస్త రిస్క్‌తో కూడుకున్న పని ఆయన అంటున్నారను.