NIFTY LEVELS: 17400 పైన..
నిఫ్టి క్రితం ముగింపు 17184. ఇవాళ నిఫ్టి ఓపెనింగ్‌లోనే 17250ని తాకొచ్చు. మార్కెట్‌లో షార్ట్ పొజిషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. సోమవారం 75 శాతం షార్ట్స్ ఉండగా, 13 శాతం మాత్రమే లాంగ్స్ ఉన్నాయి. మంగళవారం భారీ షార్ట్ కవరింగ్ వచ్చింది. అయినా ఇంకా మార్కెట్‌లో 52 శాతం షార్ట్స్ ఉన్నాయి. కాబట్టి ఇవాళ వీక్లీ క్లోజింగ్ కావడం, అమెరికా ఫ్యూచర్స్ గ్రీన్‌లో ఉండటంతో… ఇవాళ కూడా షార్ట్ కవరింగ్ వచ్చే పక్షంలో నిఫ్టి 17400ని సులభంగా చేరేఅవకాశముంది. 17500 వద్ద కాల్ రైటింగ్ చాలా ఎక్కువగా ఉంది. దాదాపు 79 లక్షల ఓపెన్ ఇంటరెస్ట్ ఉంది. కాబట్టి నిఫ్టి 17400 నుంచి 17500 మధ్య గట్టి ప్రతిఘటన ఎదురు కావొచ్చు. ఇక దిగువ స్థాయిలో చూస్తే నిఫ్టి 17200 వద్ద గట్టి మద్దతు ఉంది. ఈ స్థయిలో పుట్ రైటింగ్ బాగానే ఉంది. దాదాపు 69 లక్షల ఓపెన్ ఇంటరెస్ట్ ఉంది. అలాగే 17000 వద్ద 70 లక్షల ఓపెన్ ఇంటరెస్ట్ ఉంది. కాబట్టి 17200 స్టాప్‌లాస్‌తో నిఫ్టిలో పొజిషన్స్ కొనసాగించవచ్చని అనలిస్టలు అంటున్నారు. నిఫ్టి లెవల్స్ ఇవాళ్టికి
అప్ బ్రేకౌట్ 17518
రెండో ప్రతిఘటన 17448
తొలి ప్రతిఘటన 17400
నిఫ్టికి కీలకం 17150
తొలి మద్దతు 17145
రెండో మద్దతు 17101
డౌన్ బ్రేకౌట్ 17034