NIFTY LEVELS: ఆరంభంలోనే ఒత్తిడి
మార్కెట్ ఇవాళ 200 పాయింట్ల పైగా లాభంతో ఓపెన్ కానుంది. టెక్నికల్‌గా ఇది మార్కెట్‌కు తొలి ప్రతిఘటన ఇదే స్థాయిలో ఎదురు కానుంది. 17020 ప్రాంతంలో తరవాత 17046 వద్ద నిఫ్టికి ఒత్తిడి ఎదురు కానుంది. రేపు మార్కెట్లకు సెలవు. ఎల్లుండి వీక్లీ డెరివేటివ్స్ క్లోజ్ ఉన్నందున… ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పాల్పడే అవకాశముంది. నిన్న పొజిషన్ తీసుకున్నవారు ఇవాళ 17100 ప్రాంతంలో బయటపడవచ్చు. ఇదే స్థాయిలో నిఫ్టిని అమ్మొచ్చు కూడా. అయితే లాభమో, నష్టమో ఇవాళ బయటపడాలని అనలిస్టులు సూచిస్తున్నారు. డే ట్రేడింగ్ మాత్రమే చేయమని, పొజిషన్స్‌ను క్యారీ ఓవర్ చేయొద్దని అంటున్నారు. 17164 దాటితే గాని నిఫ్టి మరింత ముందుకు పోలేదు. మరి ఇవాళ ఆ స్థాయికి వస్తుందా అన్నది అనుమానమే. నిఫ్టికి మద్దతు 16800 ప్రాంతంలో ఉంది. కాబట్టి ఇవాళ ఎట్టి పరిస్థితుల్లోనూ నిఫ్టిని కొనుగోలు చేయొద్దు. ఇప్పటికే లాంగ్ పొజిషన్స్ తీసుకున్నవారు పాక్షిక లాభాలు స్వీకరించవచ్చు.
(formoney.in వెబ్‌సైట్ దిగువన వీడియో చూడొచ్చు.)