NIFTY LEVELS: పెరిగితే అమ్మండి
నిఫ్టికి ఉన్న అన్ని మద్దతు స్థాయిలో పోయాయి. 200 రోజుల చలన సగటు తరవాత ఇన్వెస్టర్లు దేని ఆధారంగా ఇన్వెస్ట్ చేయాలో అర్థం కావడం లేదు. దాంతో ఇపుడు ప్రధాన స్థాయిలో (PIVOTALS) గురించి ఆలోచిస్తున్నారు. నిఫ్టి క్రితం ముగింపు 16818. సింగపూర్ నిఫ్టి 75 పాయింట్ల నష్టంతో ఉంది. అంటే ఓపెనింగ్‌లోనే తొలి మద్దతు స్థాయికి రానుంది. డే ట్రేడింగ్ చేసేవారికి తొలి మద్దతు స్థాయి 16735 లేదా 16677 వద్ద అందే అవకాశముందని సీఎన్‌బీసీ ఆవాజ్ డేటా అనలిస్ట్ వీరేందర్ అంటున్నారు. ఈ రెండు స్థాయిలు కోల్పోతే తదుపరి మద్దతు 16623. కాని అసలు మద్దతు మాత్రం 16560 వద్ద ఉంది. విదేశీ ఇన్వెస్టర్లు భారీగా అమ్మకాలు జరుపుతున్నారు. క్యాష్‌లోనూ, ఆప్షన్స్‌లోనూ ఇదే ట్రెండ్. దీనికి హెడ్జింగ్‌గా ఫ్యూచర్స్ కొంటున్నారు. దీంతో విదేశీ ఇన్వెస్టర్ల రివర్సల్ కోసం మార్కెట్ ఎదురు చూస్తోంది. గత మూడు నెలల నుంచి విదేశీ ఇన్వెస్టర్లు నికర అమ్మకం దారులుగా ఉన్నారు. సో… నిఫ్టి పెరిగితే అమ్మడానికి ఛాన్స్‌గా భావించాల్సి ఉంటుంది. ఇవాళ ఒకవేళ నిఫ్టి పెరిగితే తొలి ప్రతిగటన 16866 వద్దే రావొచ్చు. లేదంటే 16940.
మరో అనలిస్ట్ నిఫ్టి అంచనా ఇలా ఉంది.
డే ట్రేడింగ్ లెవల్స్ గమనించండి.
కీలక స్థాయి 16878
తొలి మద్దతు 16736
రెండో మద్దతు 16711
డౌన్ బ్రేకౌట్ 16671
బేర్ ఫేజ్ 16564
ఈ లెవల్స్ గమనించి ట్రేడింగ్ చేయండి
(సీఎన్‌బీసీ ఆవాజ్ రివ్యూ కోసం వెబ్సైట్ దిగువ ఉన్న వీడియో చూడగలరు.)