చివరల్లో లాభాల స్వీకరణ..అయినా..
మిడ్‌సెషన్‌లో ప్రారంభమైన యూరో మార్కెట్లు నష్టాల్లోకి జారుకోవడంతో నిఫ్టి సెంటిమెంట్‌పై ప్రభావం చూపింది. అమెరికా ఫ్యూచర్స్ కూడా స్వల్ప నష్టాలతో ఉన్నాయి. ఆరంభంలో స్వల్పంగా నష్టపోయినా నిఫ్టి.. తరవాత రోజంతా పటిష్ఠమైన లాభాల్లో కొనసాగింది.దిగువ స్థాయి నుంచి దాదాపు 200 పాయింట్ల వరకు లాభపడింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 194 పాయింట్ల లాభంతో 17816 వద్ద ముగిసింది. మిడ్ సెషన్ గరిష్ఠ స్థాయి నుంచి 100 పాయింట్ల దాకా తగ్గింది. అన్ని ప్రధాన సూచీలు ఒకటి నుంచి ఒకటిన్నర శాతం వరకు లాభపడ్డాయి. అనూహ్యంగా మిడ్ సెషన్‌లో అపోలో హాస్పిటల్స్ పుంజుకుని నిఫ్టి టాప్ గెయినర్‌గా నిలిచింది. ఇక ఫుట్‌వేర్ కంపెనీలకు మంచి డిమాండ్ లభించింది. అలాగే చక్కెర షేర్లకు మద్దతు లభించింది. శ్రీ రేణుకా షుగర్స్ 10శాతంపైగా లాభపడింది. ఎఫ్‌ఎంసీజీ షేర్లకు మద్దతు కొనసాగింది. నిఫ్టిలో 42 షేర్లు లాభంతో క్లోజ్‌కావడం చూస్తుంటే ట్రెండ్ చాలా పాజిటివ్‌గా ఉన్నట్లు కన్పిస్తోంది. నిన్న భారీగా లాభపడిన బజాజ్ ఫైనాన్స్ ఇవాళ కూడా రూ.139 లాభపడింది. మీడియా షేర్లు ఇవాళ కూడా వెలుగులో ఉన్నాయి. రిలయన్స్ గ్రూప్‌నకు చెందిన మీడియా షేర్లు టీవీ18 బ్రాడ్‌కాస్ట్, నెట్‌వర్క్ 18 షేర్లు లాభాలతోముగిశాయి.