పడితే కొనండి
ప్రతికూల పరిస్థితుల్లోనూ మార్కెట్ చాలా గట్టిగా నిలబడటంతో ఈసారి దీపావళికి నిఫ్టి కొత్త రికార్డులు సృష్టించవచ్చని మార్కెట్ విశ్లేషకులు అంటున్నారు. ఇవాళ్టి ట్రేడింగ్ విషయానికొస్తే… నిఫ్టి ఆకర్షణీయ లాభాలతో ప్రారంభం కానుందని… అయితే వెంటనే కొనుగోలు చేయొద్దని ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుదర్శన్ సుఖాని అన్నారు. నిఫ్టి స్వల్పంగా క్షీణించే అవకాశముందని… ఆ సమయంలో కొనుగోలు చేయాలని ఆయన సలహా ఇచ్చారు. నిఫ్టిని కొంటే వంద పాయింట్లు, బ్యాంక్ నిఫ్టిలో 150 పాయింట్ల స్టాప్‌లాస్‌తో కొనుగోలు చేయాలని సుఖాని సలహా ఇస్తున్నారు. నిన్న కూడా నిఫ్టికి దిగువ స్థాయిలో మద్దతు లభించిందని.. కాబట్టి మార్కెట్ పాజిటివ్‌గా ఉంటుందని.. పడితే కొనుగోలు చేయాలని ఆయన సలహా ఇచ్చారు. మరో స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అశ్వని గుజ్రాల్ మాట్లాడుతూ… నిఫ్టికి 17800 వద్ద కాల్ రైటింగ్ ఉన్నా… క్రమంగా నిఫ్టి ఈ స్థాయిలను దాటుతుందని అన్నారు. దీపావళికల్లా నిఫ్టి కొత్త రికార్డు స్థాయిలకు చేరే అవకాశముందని ఆయన అన్నారు. స్ట్రిక్ట్ స్టాప్‌లాస్‌తో నిఫ్టిలో కొనసాగవచ్చని ఇన్వెస్టర్లకు ఆయన సలహా ఇస్తున్నారు. ఫెడరల్ రిజర్వ్ భేటీ తరవాత ఈక్విటీ మార్కెట్లు పెరిగే అవకాశముందని ఆయన అంచనా వేస్తున్నారు. ఐనా.. ఐటీ కౌంటర్లకు దూరంగా ఉండాలని ఆయన సలహా ఇస్తున్నారు.