స్వల్ప లాభాలకు పరిమితం
అంతర్జాతీయ మార్కెట్లు ఆకర్షణీయ లాభాల్లో ట్రేడవుతున్నా.. మన మార్కెట్లు అత్తెసరు లాభాలతో ముగిశాయి. ఉదయం 17925 పాయింట్లను తాకిన నిఫ్టి తరవాత క్రమంగా బలహీనపడుతూ వచ్చింది. మిడ్‌సెషన్ కల్లా నష్టా్లలోకి జారుకుంది. యూరప్ మార్కెట్ ఒక శాతంపైగా లాభంలో ఉండటం, అమెరికా ఫ్యూచర్స్ కూడా అర శాతంపైగా ఉండటంతో మన మార్కెట్లు స్వల్పంగా కోలుకున్నా… చివరల్లో లాభాల స్వీకరణతో నిఫ్టి 17833 వద్ద ముగిసింది. మార్కెట్లు గరిష్ఠ స్థాయిలో ఉన్నందున… చాలా మంది ఇన్వెస్టర్లు తమ పొజిషన్స్‌ను క్యారీ ఓవర్ చేయడానికి ఇష్టపడటం లేదు. అదానీ పోర్ట్స్‌తో పాటు ఐటీ షేర్లకు ఇవాళ మంచి మద్దతు లభించింది. గత కొన్ని రోజులుగా పెరుగుతూ వచ్చిన సిమెంట్ షేర్లలో స్వల్ప ఒత్తిడి కన్పించింది. బజాజ్ హోల్డింగ్స్‌కు ఇవాళ మంచి మద్దతు లభించింది. ఈ షేర్ నాలుగు శాతంపైగా లాభంతో ముగిసింది. అలాగే పేటీఎం కూడా ఆకర్షణీయ లాభాలను ఆర్జించింది.గత కొన్ని రోజుల నుంచి నాన్ స్టాప్‌గా పెరుగుతున్న ఆస్ట్రాల్ షేర్ ఇవాళ 4.4 శాతం లాభంతో ముగిసింది. ఈ షేర్ చాలా తక్కవ సమయంలో రూ.2000 నుంచి రూ. 2600లకు చేరడం విశేషం.