లాభాలను కోల్పోయినా…
ఉదయం ఆర్జించిన లాభాలను నిఫ్టి కోల్పోయి నష్టాల్లోకి జారుకుంది. ఉదయం 10.30 గంటల నుంచి క్రమంగా బలహీనపడుతూ వచ్చిన నిఫ్టి మిడ్ సెషన్లో 17786ని తాకి నష్టాల్లోకి జారుకుంది. అక్కడి నుంచి తేరుకుని ఇపుడు 17831 వద్ద లాభాల్లో ట్రేడవుతోంది. ప్రస్తుతం 32 పాయింట్ల లాభంలో ఉంది. నిఫ్టి బ్యాంక్ 0.41 శాతం, నిఫ్టి మిడ్ క్యాప్ 0.35 శాతం లాభంతో ఉన్నాయి. నిఫ్టిలో 28 షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఐటీ షేర్లు ఇవాళ లాభాల్లో ఉండటం విశేషం. యూరోమార్కెట్లు ఒక శాతంపైగా లాభంతో ఉండటంతో పాటు అమెరికా ఫ్యూచర్స్ 0.7 శాతం లాభాల్లో ఉండటం పాజిటివ్ పరిణామాలు. మరి క్లోజింగ్ సమాయానికి నిఫ్టి గరిష్ఠ స్థాయికి చేరుతుందేమో చూడాలి.