For Money

Business News

భారీ నష్టాల్లో SGX NIFTY

రాత్రి అమెరికా మార్కెట్లు ఒక మోస్తరు నష్టాలతో ముగిసినా ఆసియా మార్కెట్లు భారీ నష్టాలతో ఉన్నాయి. రాత్రి డాలర్‌ ఇండెక్స్‌ 110ని దాటడంతో క్రూడ్‌ ఆయిల్‌ ధర మరింత తగ్గింది. రాత్రి అమెరికా పీఎంఐ ఇండెక్స్‌ పాజిటివ్‌గా రావడంతో ఈ నెలలో ఫెడరల్‌ రిజర్వ్ వడ్డీ రేట్ల వడ్డన అధికంగా ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో ఐటీ, టెక్‌ షేర్లలో అమ్మకాల ఒత్తిడి పెరుగుతోంది.నాస్‌డాక్‌ వరుసగా ఏడో రోజు కూడా నష్టాల్లో ముగిసింది. నాస్‌డాక్‌ 0.74 శాతం నష్టపోగా, ఇతర సూచీలు అర శాతం వరకు నష్టపోయాయి. ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు భారీ నష్టాలతో ట్రేడవుతున్నాయి. ముఖ్యంగా హాంగ్‌సెంగ్‌, తైవాన్‌ ఒకటిన్నర శాతం పైగా నష్టంతో ఉండగా… జపాన్‌ నిక్కీ,ఆస్ట్రేలియా మార్కెట్లు ఒక శాతంపైగా నష్టంతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో సింగపూర్ నిఫ్టి 197 పాయింట్ల నష్టంతో అంటే ఒకశాతంపైగా నష్టంతో ట్రేడవుతోంది. నిఫ్టి నష్టాల్లో ప్రారంభం కావడం ఖాయం. కాని ఈ స్థాయి నష్టాలతో ప్రారంభం అవుతుందా అన్నది చూడాలి.