నిలకడగా సింగపూర్ నిఫ్టి
శుక్రవారం అమెరికా మార్కెట్ల ప్రభావం ఇవాళ ఆసియా మార్కెట్లపై కన్సిస్తోంది. ముఖ్యంగా చైనా పీఎంఐ డేటా అంచనాల మేర లేకపోవడంతో చైనాతో పాటు హాంగ్‌సెంగ్ మార్కెట్లు ఒకటిన్నర శాతం వరకు నష్టంతో ఉన్నాయి. గత శుక్రవారం అమెరికా మార్కెట్లు ఒక మోస్తరు నష్టాలతో ముగిశాయి. మూడు ప్రధాన సూచీలు ఒక శాతంపైగా నష్టంతో ముగిశాయి. క్రూడ్ తగ్గినట్లే కన్పించినా.. బ్రెంట్ క్రూడ్ 95 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. క్రూడ్ ధరల కంటే మన మార్కెట్‌ను ఆందోళ కల్గించే అంశం… డాలర్ బలం. డాలర్ ఇండెక్స్ ఇవాళ 110ని తాకే అవకాశముంది. ఆర్బీఐ ఇంకెంత కాలం రూపాయిని రక్షిస్తుందో చూడాలి. శుక్రవారం యూరో మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. జర్మనీ సూచీ మూడు శాతంపైగా పెరిగింది. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ఉండటంతో సింగపూర్ నిఫ్టి స్వల్ప నష్టంతో ఉంది. సింగపూర్ నిఫ్టి 40 పాయింట్ల నష్టంతో ఉంది. సో.. నిఫ్టి స్థిరంగా లేదా స్వల్ప నష్టంతో ప్రారంభం కానుంది.