టాటా సన్స్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ మృతి
టాటా సన్స్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ (54) కన్నుమూశారు. అహ్మదాబాద్ నుంచి ముంబయి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. మహారాష్ట్రలోని పాల్ఘార్ జిల్లాలో సూర్యనది వంతెనపై ఆయన ప్రయాణిస్తున్న కారు డివైడర్‌ను ఢీకొనడంతో ఆయన మరణించారు. ఆయన తండ్రి షాపూర్జీ పల్లోంజీ (93) మృతి చెందారు. ప్రమాద సమయంలో కారులో నలుగురు ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. సైరస్ మిస్త్రీకి చెందిన కంపెనీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో ఆసియాలోనే అతి పెద్ద కంపెనీల్లో ఒక్కటి. ఇటీవల హైదరాబాద్‌లో ప్రారంభమైన పోలీస్ పోలీస్ ట్విన్ టవర్స్‌తో పాటు త్వరలో పూర్తి కానున్న తెలంగాణ సెక్రటేరియట్‌ను కూడా ఈయన కంపెనీనే నిర్మిస్తోంది. 1968 జులై 4వ తేదీన జన్మించిన సైరస్ పి మిస్త్రీ బ్రిటన్‌లో చదువుకున్నారు. టాటా సన్స్‌లో షాపూర్జీ పల్లోంజీ కుటుంబానికి 18 శాతం వాటా ఉంది. 2006 నుంచి టాటా సన్స్‌కు డైరెక్టర్‌గా పనిచేసిన, ఆయన నవంబర్ 2011లో టాటా సన్స్‌కు డిప్యూటీ ఛైర్మన్‌గా ఎంపికయ్యారు. టాటా ఇండస్ట్రీస్ లిమిటెడ్, టాటా స్టీల్ లిమిటెడ్, టాటా పవర్ కంపెనీ లిమిటెడ్, టాటా టెలిసర్వీసెస్ లిమిటెడ్, టాటా కన్సల్టెన్సీ సర్వీస్ లిమిటెడ్ కంపెనీలకు కూడా ఆయన డైరెక్టర్‌గా వ్యవహరించారు.
2012లో టాటా గ్రూప్‌నకు సైరస్మిస్త్రీ ఛైర్మన్ అయ్యారు. కాని కంపెనీల నిర్వహణలో విభేదించిన రతన్ టాటా.. మిస్త్రని తప్పించి చంద్రశేఖరన్ టాటా సన్స్ ఛైర్మన్‌గా నియమించారు. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ సైరస్ మిస్త్రీ సుప్రీం కోర్టును ఆశ్రయించినా ఫలితం లేకపోయింది.