వాణిజ్య ఎల్పీజీ ధర తగ్గింపు
వాణిజ్య అవసరాలకు ఉపయోగించే వంట గ్యాస్ ధర స్వల్పంగా తగ్గింది. 19 కిలోల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను రూ.91.50 చొప్పున తగ్గిస్తున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. ఫలితంగా ఢిల్లీలో ఇప్పటివరకు రూ. 1885లకు తగ్గింది. కోల్కతాలో ధర రూ. 1995, ముంబైలో రూ. 1844, చెన్నైలో ధర రూ.2,045కు తగ్గింది. గృహావసరాలకు వినియోగించే వంట గ్యాస్ ధరల్లో మాత్రం ఎలాంటి తగ్గింపు లేదు.