For Money

Business News

పడినపుడల్లా ఈ షేర్‌ కొనండి!

ఐటీ రంగం తీవ్ర ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటోంది. బడా బడా కంపెనీల షేర్లు కూడా భారీగా క్షీణిస్తున్నాయి. ఈ వారం కూడా ఐటీ షేర్లలో ఒత్తిడి రానుంది. ఈ నేపథ్యంలో ఆఫెల్‌ ఇండియా షేర్‌ను పలు బ్రోకింగ్‌ సంస్థలు, విశ్లేషకులు రెమెండ్‌ చేస్తున్నారు. మొబైల్‌ డిజిటల్‌ అడ్వర్టయిజింగ్‌ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న ఈ కంపెనీ గత మూడు నెల్లో 50 శాతంపైగా పెరిగింది. జూన్‌ నెలలో రూ.900 ప్రాంతంలో ఉన్న ఈ షేర్‌ ఇపుడు రూ.1327 వద్ద ట్రేడవుతోంది. 2022-23 నుంచి 2024-25 వరకు కంపెనీ ఆదాయం ఏటా 32 శాతం చొప్పున పెరిగే అవకాశముందని గోల్డ్‌మన్‌ శాచ్స్‌ అంటోంది. ఈ మార్కెటింగ్‌ బిజినెస్‌ కూడా ఇదే స్పీడుతో పెరుగుతుందని అంటోంది. ఈ నేపథ్యంలో రరూ. 1495 టార్గెట్‌తో ఈ షేర్‌ను కొనుగోలు చేయాల్సిందిగా గోల్డ్‌మన్‌ సాచ్స్‌ అంటోంది. ఇంటర్‌నెట్‌, స్మార్ట్‌ఫోన్‌, ఈ కామర్స్‌ వ్యాపారం పెరుగుతున్న నేపథ్యంలో వృద్ధి అవకాశాలు అధికంగా ఉన్నాయని అంటోంది. దీర్ఘకాలానికైతే అంటే ఏడాది లేదా రెండూళ్ళ వ్యవధిలో ఈ కంపెనీ షేర్‌ రూ.2000 దాటుతుందని మరో స్టాక్‌ మార్కెట్‌ విశ్లేషకుడు రజత్‌ బోస్‌ అంటున్నారు. పడినపుడల్లా ఈ షేర్‌ను కొనుగోలు చేయొచ్చని సలహా ఇస్తున్నారు.