ద్రవ్యోల్బణ కట్టడిలో కొంత బాధ తప్పదు
ద్రవ్యోల్బణ కట్టడి తమ అత్యధిక ప్రాధాన్యమని అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్ అన్నారు. జాక్సన్ హోల్లో జరిగిన ఫెడరల్ రిజర్వ్ వార్షిక సమావేశంలో ఆయన మాట్లాడారు. ద్రవ్యోల్బణం తగ్గించే ప్రక్రియలో కాస్త మూల్యం చెల్లించుకోక తప్పదని అన్నారు. ధరలు స్థిరీకరించకుండా.. బాధలు మరింత ఎక్కువగా ఉంటాయని ఆయన అన్నారు. పారిశ్రామిక వృద్ధిరేటు కాస్త మందగించినా పరవాలేదని.. అయితే ప్రజలకు.. వ్యాపారసంస్థల ప్రయోజనాల దృష్ట్యా ధరలు తగ్గించాల్సి ఉందని అన్నారు. అయితే సెప్టెంబర్లో వడ్డీ రేట్లు ఏ మేరకు పెంచుతారనే అంశంపై ఆయన క్లారిటీ ఇవ్వలేదు. వచ్చే డేటా ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని అన్నారు. సెప్టెంబర్లో ఫెడరల్ రిజర్వ్ మరో 0.75 శాతం మేర వడ్డీ రేట్లను పెంచవచ్చని భావిస్తున్నారు.