డిసెంబర్‌కల్లా 18600కి నిఫ్టి
బ్యాంకింగ్ ఫైనాన్షియల్ రంగం, ఐటీ, ఆటోతో పాటు క్యాపిటల్ గూడ్స్ రంగాల ఊతంతో నిఫ్టి డిసెంబర్‌కల్లా 18600 పాయింట్ల స్థాయికి చేరే అవకావముందని ఐసీఐసీఐ డైరెక్ట్ పేర్కొంది. ఐసీఐసీఐ బ్యాంక్‌కు చెందిన ఈ విభాగం షేర్ మార్కెట్ ట్రేడింగ్ వ్యవహారాలను చూస్తుంది. మార్కెట్ సమీప భవిష్యత్తుపై ఈ సంస్థ ఓ నివేదికను విడుదల చేసింది. 16800 వద్ద నిఫ్టికి గట్టి మద్దతు ఉంటుందని.. దీన్ని స్టాప్‌లాస్‌గా చేసుకుని.. నిఫ్టి పడినపుడల్లా నిఫ్టిని కొనుగోలు చేయాల్సిందిగా ఇన్వెస్టర్లకు ఈ సంస్థ సలహా ఇచ్చింది. మార్కెట్ పెరిగేందుకు ప్రభావితం చేసే అయిదు అంశాలను ఈ నివేదికలో పేర్కొంది. నిఫ్టి గత ఎనిమిది నెలల నుంచి కరెక్టివ్ ఫేజ్‌లో ఉందని, ఆ ఫేజ్ దాదాపు పూర్తి కావొస్తోందని ఐసీఐసీఐ డైరెక్ట్ పేర్కొంది. మార్కెట్ బాటమ్ఔట్ అవుతోందని పేర్కొంది.గత రెండు నెలల్లో మార్కెట్లో వచ్చిన ర్యాలీతో గోల్డన్ క్రాస్ఓవర్ ఏర్పడిందని పేర్కొంది. గడచిన దశాబ్దంలో ఇలా గోల్డన్ క్రాస్ఓవర్ ఏర్పడిన 10 సందర్భాల్లో నిఫ్టి 8 సార్లు 11 శాతం మించి ప్రతిఫలం ఇచ్చిందని ఐసీఐసీఐ డైరెక్ట్ పేర్కొంది. ఎనిమిది నెలల ఫాలింగ్ ఛానల్‌ను నిఫ్టి బ్రేకౌట్ చేసిందని.. దీంతో ఇన్నాళ్ళ కరెక్టివ్ ఫేజ్ పూర్తయిందని వెల్లడించింది. బ్రెంట్ క్రూడ్ ఇక మున్ముందు పెరిగే ఛాన్స్ లేదని.. రెండేళ్ళ ట్రెండ్‌లైన్‌ను బ్రేక్ చేసి బ్రెంట్ క్రూడ్ దిగువకు వచ్చేసిందని ఐసీఐసీఐ డైరెక్ట్ పేర్కొంది. మధ్యలో కొన్ని రోజులు పెరిగినా.. ఎంతో కాలం ఉండదని పేర్కొంది.